నమ్మకం... అలా తినిపించింది | Rafael Nadal Wins U.S. Open Championship | Sakshi
Sakshi News home page

నమ్మకం... అలా తినిపించింది

Sep 13 2013 1:24 AM | Updated on Apr 4 2019 5:12 PM

స్పెయిన్ టెన్నిస్ స్టార్, యూఎస్ ఓపెన్ చాంపియన్ రాఫెల్ నాదల్‌లో పవర్ షాట్లే కాదు... పవర్‌ఫుల్ మూఢనమ్మకాలు ఉన్నాయండోయ్! ఆ నమ్మకాలెంత పవర్‌ఫుల్ అంటే...

న్యూయార్క్:  స్పెయిన్ టెన్నిస్ స్టార్, యూఎస్ ఓపెన్ చాంపియన్ రాఫెల్ నాదల్‌లో పవర్ షాట్లే కాదు... పవర్‌ఫుల్ మూఢనమ్మకాలు ఉన్నాయండోయ్! ఆ నమ్మకాలెంత పవర్‌ఫుల్ అంటే... ఒకే రెస్టారెంట్లో, ఒకే టేబుల్‌పై, ఒకే విధమైన భోజనాన్ని టోర్నీ అసాంతం తినిపించేంత..! యూఎస్ చాంపియన్‌షిప్‌ను సాధించేందుకు వచ్చిన ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ ఇక్కడి మన్‌హటన్ చైనీస్ రెస్టారెంట్లోనే ప్రతి రాత్రి భోజనం చేసేవాడు. రోజూ ఒకే డైనింగ్ టేబుల్‌పై ఫ్రైడ్ రైస్, నూడుల్స్ భుజించేవాడని ‘న్యూయార్క్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది.
 
 రాత్రి మ్యాచ్ లేని రోజు ఇలా చేసేవాడని, ఫైనల్‌కు ముందు ఆదివారం రాత్రి కూడా అక్కడే అదే విధమైన ఆహారం రుచి చూశాడని ఆ పత్రిక పేర్కొంది. టైటిల్ విజయానంతరం వేడుకలు కూడా ఆ రెస్టారెంట్ టేబుల్‌పైనే జరిగాయంటే... అతని మూఢనమ్మకమెంత పవర్‌ఫులో అర్థం చేసుకోవచ్చు మరి! ఈ వేడుకల్లో అతని ప్రియసఖి జిస్కా పెరెల్లో, కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు పాల్గొన్నారు. ఈ చాంపియన్ కోసం ఆ రోజు (టైటిల్ గెలిచిన రోజు) రెస్టారెంట్‌ను అర్ధరాత్రి 12.30 గంటల వరకు తెరిచేవుంచారట నిర్వాహకులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement