మళ్లీ అతడేనా! | Rafael Nadal and Novak Djokovic set for French Open final | Sakshi
Sakshi News home page

మళ్లీ అతడేనా!

Jun 8 2014 1:52 AM | Updated on Sep 2 2017 8:27 AM

మళ్లీ అతడేనా!

మళ్లీ అతడేనా!

మట్టి కోర్టులపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పట్టుదలతో రాఫెల్ నాదల్... అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్...

జొకోవిచ్‌తో నాదల్ అమీతుమీ
 నేడు ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్
 
 పారిస్: మట్టి కోర్టులపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పట్టుదలతో రాఫెల్ నాదల్... అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ ఆదివారం జరిగే ఫ్రెంచ్ ఓపెన్ అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నారు.
 
  ఇప్పటికే రికార్డుస్థాయిలో 8 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాదల్‌కు ఈ టోర్నీ చరిత్రలో ఒకే ఒక్క పరాజయం ఎదురైంది. 2009లో ప్రిక్వార్టర్ ఫైనల్లో రాబిన్ సోడెర్లింగ్ (స్వీడన్) చేతిలో ఓడిపోయిన నాదల్ ఆ తర్వాత గత నాలుగేళ్లుగా టైటిల్‌ను నిలబెట్టుకుంటున్నాడు.
 ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ కూడా నెగ్గితే ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసుకుంటాడు. దాంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకుంటాడు. ప్రస్తుతం ఈ సెర్బియా స్టార్ ఫామ్ పరిగణనలోకి తీసుకుంటే ఆదివారం అద్భుతం జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
 
 నాదల్, జొకోవిచ్ ముఖాముఖిగా 41 సార్లు పోటీపడ్డారు. నాదల్ 22 సార్లు, జొకోవిచ్ 19 సార్లు గెలిచారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ ఇద్దరూ ఐదుసార్లు తలపడగా... ఐదు పర్యాయాలూ నాదల్‌నే విజయం వరించింది.
 
  తాను ఆడిన 8 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో నాదల్ మూడింటిని మూడు సెట్‌లలో... మిగతా ఐదింటిని నాలుగు సెట్‌లలో గెలిచాడు. ఏ ఫైనల్ కూడా ఐదు సెట్‌లు జరగకపోవడం నాదల్ ఆధిపత్యాన్ని సూచిస్తోంది.
 
 సాయంత్రం గం. 6.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement