ఖతార్ మాస్టర్స్ టోర్నీ: హారికకు రెండో గెలుపు | Sakshi
Sakshi News home page

ఖతార్ మాస్టర్స్ టోర్నీ: హారికకు రెండో గెలుపు

Published Mon, Dec 1 2014 12:41 AM

ఖతార్ మాస్టర్స్ టోర్నీ: హారికకు రెండో గెలుపు - Sakshi

దోహా: ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో విజయాన్ని తన ఖాతాలో జమచేసుకుంది. ఎరిక్ హెడ్మాన్ (స్వీడన్)తో ఆదివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 32 ఎత్తుల్లో గెలిచింది. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఈ టోర్నీలో తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. ఎల్తాజ్ సఫర్లీ (అజర్‌బైజాన్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 22 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. భారత్‌కే చెందిన విజయలక్ష్మీ, కొంగువేల్ పొన్నుస్వామి, అభిజిత్ గుప్తా, సందీపన్ చందాలు తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement