ఢిల్లీ సుల్తాన్స్‌ డీలా | Pro Wrestling League: Haryana Hammers enter semi-finals, Delhi Sultans out | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సుల్తాన్స్‌ డీలా

Jan 12 2017 1:05 AM | Updated on Sep 5 2017 1:01 AM

ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో ఢిల్లీ సుల్తాన్స్‌ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. హరి యాణా హ్యామర్స్‌ జట్టుతో బుధవారం జరిగిన

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌–2లో ఢిల్లీ సుల్తాన్స్‌ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. హరి యాణా హ్యామర్స్‌ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సుల్తాన్స్‌ 2–5తో పరాజయం పాలైంది. ఈ లీగ్‌లో ఢిల్లీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం గమనార్హం. మరోవైపు హరియాణా హ్యామర్స్‌ జట్టుకిది వరుసగా మూడో విజయం. హరియాణా జట్టులో గడిసోవ్‌ (97 కేజీలు), కుర్బనలీవ్‌ (70 కేజీలు), రజనీశ్‌ (65 కేజీలు), మర్వా అమ్రి (58 కేజీలు), సందీప్‌ తోమర్‌ (57 కేజీలు) విజయం సాధించారు. ఢిల్లీ జట్టు తరఫున స్టడ్‌నిక్‌ (48 కేజీలు), మకైనియా (75 కేజీలు)  నెగ్గారు.

Advertisement

పోల్

Advertisement