జూనియర్‌ ఎన్‌బీఏ టోర్నీకి ప్రతీక్, హర్ష్‌ | Prateek, Harsh selected for Junior NBA Tourney | Sakshi
Sakshi News home page

జూనియర్‌ ఎన్‌బీఏ టోర్నీకి ప్రతీక్, హర్ష్‌

Mar 31 2018 11:19 AM | Updated on Mar 31 2018 11:19 AM

Prateek, Harsh selected for Junior NBA Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగే జూనియర్‌ ఎన్‌బీఏ నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌కు ‘స్లేట్‌ ది స్కూల్‌’ విద్యార్థులు గోన ప్రతీక్,  హర్ష్‌ కర్వా ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని జేపీ అట్లాంటిస్‌ ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా ఏప్రిల్‌ 29 నుంచి మే 22 వరకు ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా టోర్నీలో పాల్గొనే పురుషుల, మహిళల జట్లను శుక్రవారం ప్రకటించారు. పురుషుల జట్టుకు ప్రతీక్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇదే కాకుండా అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే బాస్కెట్‌బాల్‌ కోచింగ్‌ క్యాంపుకు కూడా ప్రతీక్‌ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా స్లేట్‌ ది స్కూల్‌ చైర్మన్‌ అమర్‌నాథ్‌ వాసిరెడ్డి ప్రతీక్‌ను అభినందించారు.  

జట్ల వివరాలు

పురుషులు: జి. ప్రతీక్, హర్ష్‌, హరిద్వారకేశ్, సిద్ధార్థ్‌ గంగరాజు, కె. సర్దానా, సాయి కిషోర్, అక్షిత్‌ రెడ్డి, అన్‌మోల్‌ పవార్, భవాని ప్రసాద్, ఎమ్మాన్యుయేల్, పి. నవీన్‌ కుమార్‌ (కోచ్‌).  

మహిళలు: అర్షియా త్యాగి, కె. శ్రీయ, రేఖ, అమూల్య, అసలత్‌ సుల్తానా, యశస్విని, లోరెట్టా శరణ్‌ రాబర్ట్, జియా ధావల్‌ సుతార్, శ్రేయ, పాల్య గుడిపాడి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement