199 బంతుల్లో 652 నాటౌట్! | pranav dhanwade creates world record | Sakshi
Sakshi News home page

199 బంతుల్లో 652 నాటౌట్!

Jan 5 2016 9:30 AM | Updated on Sep 3 2017 3:08 PM

199 బంతుల్లో 652 నాటౌట్!

199 బంతుల్లో 652 నాటౌట్!

ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే సంచలనం సష్టించాడు. ఒకే రోజు 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

స్కూల్ కుర్రాడి ప్రపంచరికార్డు

ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధనవాడే సంచలనం సష్టించాడు. ఒకే రోజు 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సోమవారం ముంబై క్రికెట్ సంఘం నిర్వహించిన ఇంటర్ స్కూల్ టోర్నీలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఆర్య గురుకుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేసీ గాంధీ స్కూల్ బ్యాట్స్‌మన్ ప్రణవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 199 బంతుల్లో అతను 652 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి.

మైనర్ క్రికెట్‌లో ఈ రికార్డు నమోదు చేసినా... ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు ఏఈజే కొలిన్స్ (628 పరుగులు-1899లో) పేరిట ఉంది. ఇప్పుడు ప్రణవ్ 116 సంవత్సరాల ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2014లో ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది.

Advertisement
 
Advertisement
Advertisement