కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన రికీ పాంటింగ్! | Ponting starts new innings as Mumbai Indians coach | Sakshi
Sakshi News home page

కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన రికీ పాంటింగ్!

Mar 30 2015 9:46 PM | Updated on Sep 2 2017 11:36 PM

కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన రికీ పాంటింగ్!

కొత్త ఇన్నింగ్స్ ఆరంభించిన రికీ పాంటింగ్!

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇక నుంచి కొత్త అవతారంలోకనిపించబోతున్నాడు.

ముంబై:ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇక నుంచి కొత్త అవతారంలోకనిపించబోతున్నాడు.  ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ కోచ్ గా పాంటింగ్ సరికొత్త బాధ్యతలను చేపట్టాడు. ఈ మేరకు గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్న రికీ.. తన కొత్త ఇన్నింగ్స్ కు  సోమవారం శ్రీకారం చుట్టాడు. 2013 ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ టీంలో ఆటగాడిగా కనువిందు చేసిన పాంటింగ్.. ఐపీఎల్-8 వచ్చే సరికి కోచ్ గా మారాడు. 

 

ఇప్పటికే ముంబై చేరుకున్న రికీ పాంటింగ్ ఆటగాళ్లతో కలిసి శిక్షణలో పాల్గొంటున్నాడు. ఏప్రిల్ -8నుంచి ఐపీఎల్ ఆరంభ కానున్న సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్ లో జరిగే తన తొలి మ్యాచ్ లో  డిఫెండింగ్  ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement