ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగే టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
మిర్పూర్: ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగే టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్, బంగ్లా జట్లలో చిన్న మార్పులు చోటుచేసుకున్నాయి. మహమ్మద్ నవాజ్ స్థానంలో అన్వర్ అలీ జట్టులోకి వచ్చాడు. అలాగే బంగ్లా జట్టులో తమీమ్ ఇక్బాల్, ఆరాఫత్ సన్నీ స్థానం దక్కించుకోగా, నురల్ హసన్, ముస్తాఫిజర్ లు తుదిజట్టులో చోటు కోల్పోయారు. టాస్ గెలిస్తే తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాడినని బంగ్లా కెప్టెన్ మష్రాఫే మోర్తాజా చెప్పడం గమనార్హం.