రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు:ముద్గల్ కమిటీ | owner of Rajasthan Royals Raj Kundra was in contact with bookies,Mudgal Committee | Sakshi
Sakshi News home page

రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు:ముద్గల్ కమిటీ

Nov 17 2014 4:03 PM | Updated on Sep 2 2017 4:38 PM

రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు:ముద్గల్ కమిటీ

రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు:ముద్గల్ కమిటీ

2013 లో జరిగిన ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ సహయజమాని రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు కొనసాగించినట్లు ముద్గల్ కమిటీ తేల్చింది.

న్యూఢిల్లీ: గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాకు బుకీలతో సంబంధాలు కొనసాగించినట్లు ముద్గల్ కమిటీ తేల్చింది. దీంతో పాటు క్రికెట్ అడ్మినిస్టేటర్ సుందర రామన్ కు కూడా బుకీలతో సంబంధాలున్నట్లు స్పష్టం చేసింది. ఓ బుకీకి సుందర రామన్ ఎనిమిదిసార్లు ఫోన్ చేసినట్లు ఆధారాలు లభించాయని ముద్గల్ కమిటీ పేర్కొంది.

 

అయితే బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ తో పాటు అతని మేనల్లుడు గురునాథన్ మెయప్పన్ లకు క్లీన్ చిట్ లభించింది. ఆ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి మెయప్పన్ లపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని కమిటీ పేర్కొంది. ఐపీఎల్-2013 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుకు సంబంధించి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement