దీటుగా బదులిస్తున్న కివీస్ | new zealand replys solid | Sakshi
Sakshi News home page

దీటుగా బదులిస్తున్న కివీస్

Mar 9 2017 4:14 PM | Updated on Sep 5 2017 5:38 AM

దీటుగా బదులిస్తున్న కివీస్

దీటుగా బదులిస్తున్న కివీస్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దీటుగా బదులిస్తోంది.

దునెదిన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దీటుగా బదులిస్తోంది. గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.లాథమ్(10),రావల్(52), నికోలస్(12)లు నిష్క్రమించగా, కేన్ విలియమ్సన్(78 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు 229/4 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 308 పరుగుల వద్ద ఆలౌటైంది.

 

ఓవర్ నైట్ ఆటగాళ్లు ఎల్గర్(140),బావుమా (64)లు మినహా మిగతా వారు పెద్దగా రాణించకపోవడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరును సాధించలేకపోయింది. కివీస్ బౌలర్లలో బోల్ట్ నాలుగు వికెట్లు సాధించగా, వాగ్నర్ మూడు వికెట్లు తీశాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement