ఆధిక్యంలో దక్షిణాఫ్రికా | Dean Elgar pushes visitors to 191 run lead | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో దక్షిణాఫ్రికా

Mar 12 2017 12:17 AM | Updated on Sep 5 2017 5:49 AM

ఆధిక్యంలో దక్షిణాఫ్రికా

ఆధిక్యంలో దక్షిణాఫ్రికా

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 191 పరుగుల ఆధిక్యంలో ఉంది.

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 191 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు తమ రెండో ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో ఆరు వికెట్లకు 224 పరుగులు చేసింది. ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ (249 బంతుల్లో 89; 9 ఫోర్లు) ఓపిగ్గా ఆడి అర్ధ సెంచరీ చేశాడు.

ప్రస్తుతం క్రీజులో డు ప్లెసిస్‌ (155 బంతుల్లో 56 బ్యాటింగ్‌; 10 ఫోర్లు), ఫిలాండర్‌ (1 బ్యాటింగ్‌) ఉన్నారు. వర్షం కారణంగా రెండుసార్లు ఆటకు అంతరాయం కలిగింది. అలాగే వెలుతురులేమితో 20 నిమిషాలు ముందుగానే ఆటను ముగించారు. నేడు (ఆదివారం) మ్యాచ్‌కు చివరి రోజు కాగా ప్రొటీస్‌ విధించే లక్ష్యంతో పాటు వర్ష సూచన కూడా కీలకం కానుంది. వాగ్నర్, జీతన్‌ పటేల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement