‘కోహ్లికి ఇదే నా వందనం’ | My salute to Virat Kohli, Says Harbhajan | Sakshi
Sakshi News home page

‘కోహ్లికి ఇదే నా వందనం’

Oct 27 2018 1:29 PM | Updated on Oct 27 2018 1:31 PM

My salute to Virat Kohli, Says Harbhajan - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిజంగానే పరుగుల యంత్రమని వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ పట్ల కోహ్లి నిబద్ధత, కఠోర శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువేనని భజ్జీ కొనియాడాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో వన్డేల్లో అత్యంత వేగవంతంగా 10 వేల పరుగుల మైలురాయిని కోహ్లి అందుకున్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా మాట్లాడిన హర్భజన్‌.. ‘కోహ్లి అంకితభావానికి, ఆటతీరుకు ఎవరైనా వందనం చేయాల్సిందే. ఈ మధ్య కాలంలో తాను చూసి అత్యుత్తమ క్రికెటర్ కోహ్లినే. మైదానంలో దిగిన ప్రతిసారి కోహ్లిఅద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంచనాలను అందుకుని రాణించే అరుదైన ఆటగాళ్లలో కోహ్లి ఒకడు. విరాట్ కోహ్లిలా ఆటడం మరో ఆటగాడికి సాధ్యం కాదేమో. జట్టు భారాన్ని తన భుజాలపై మోస్తున్నాడు. చాలా మంది దిగ్గజాలతో క్రికెట్ ఆడాననీ, ప్రస్తుత తరంలో మాత్రం కోహ్లినే నెంబర్ వన్. కోహ్లికి ఇదే నా వందనం’ అని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement