కివీస్‌తో వన్డే: ధోని ఔట్‌.. పాండ్యా ఇన్‌ | MS Dhoni Rested For 3rd ODI Against New Zealand | Sakshi
Sakshi News home page

Jan 28 2019 8:13 AM | Updated on Jan 28 2019 8:14 AM

MS Dhoni Rested For 3rd ODI Against New Zealand - Sakshi

మౌంట్‌మాంగనీ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేకు టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని దూరమయ్యాడు. భుజకండరాల నొప్పితో బాధపడుతున్న ధోనికి విశ్రాంతినిచ్చిన టీమ్‌మేనేజ్‌మెంట్‌ అతని స్థానంలో దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం ఇచ్చింది. అలాగే ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యాను జట్టులోకి తీసుకుంది. వివాదానంతరం పాండ్యా జట్టులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కివీస్‌ జట్టులో కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రాండ్‌ హోమ్‌ స్థానంలో మిచెల్‌ సాన్‌ట్నర్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను భారత పేస్‌ ద్వయం దెబ్బతీసింది. ఓపెనర్లు కొలిన్‌మున్రో(7), గప్టిల్‌ (13)ల వికెట్లను ఆదిలోనే కోల్పో​యింది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్‌(9), టేలర్‌(2)లు ఉన్నారు.

తుది జట్లు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాయుడు, దినేశ్‌ కార్తీక్‌, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, చహల్‌.  
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోల్స్, సాన్‌ట్నర్, బ్రేస్‌వెల్, సోధి, ఫెర్గూసన్, బౌల్ట్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement