రాంచీ టెస్టుకు ధోని!

MS Dhoni Likely To Attend Ranchi Test On Saturday - Sakshi

రాంచీ: గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. జట్టు సభ్యుల్ని కలిసే అవకాశం దొరికింది. రాంచీలో రేపు(శనివారం) దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న చివరిదైన మూడో టెస్టుకు ధోని వచ్చే అవకాశాలు ఉన్నాయి. తన సొంత మైదానంలో టెస్టు జరుగనున్న తరుణంలో ధోని హాజరు కావాలని నిర్ణయించుకున్నాడట. దీనిపై అధికారికి సమాచారం లేకపోయినా ధోని మ్యాచ్‌ను వీక్షేందుకు వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. జార్ఖండ్‌ మాజీ కెప్టెన్‌, ధోని చిన్ననాటి మిత్రుడు మహీర్‌  దివాకర్‌తో కలిసి మ్యాచ్‌కు ధోని రానున్నాడట. శనివారం ఉదయమే అక్కడికి చేరుకుంటాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.(ఇక్కడ చదవండి: కొత్త చరిత్రపై టీమిండియా గురి)

కొన్ని నెలలుగా తన వ్యక్తిగత పనులతో బిజీగా ఉంటున్న ధోని.. టీమిండియాతో మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. ఈ తరుణంలో ధోని రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అతను రిటైర్మెంట్‌ తీసుకునే క‍్రమంలోనే సుదీర్ఘ విశ్రాంతికి మొగ్గుచూపాడని అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న గంగూలీ సైతం ధోని మనసులో ఏముందో చెప్పాలని అంటున్నాడు.  భారత క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌కు ధోని స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని పేర్కొన్నాడు. మరి రాంచీ టెస్టుకు ధోని హాజరైతే అతని రిటైర్మెంట్‌కు సంబంధించి స్పష్టత వస్తుందా లేదో చూడాలి. ఇప్పటికే భారత్‌ జట్టు 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకోగా, చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top