‘లవ్‌రాత్రి’ జోడికి ఎంఎస్‌ ధోని విందు

MS Dhoni hosts Loveratri actors Aayush Sharma and Warina Hussain in Ranchi - Sakshi

రాంచీ: క్రికెట్‌ నుంచి కాస్త విరామం దొరకడంతో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపుతున్నాడు. ఈ క‍్రమంలోనే కూతురు జీవాతో కలిసి ఆడుకుంటున్న వీడియోలను ధోని సామాజిక మాధ్యమాల ద్వారా తరచు పంచుకుంటూనే ఉన్నాడు.

తాజాగా తన నివాసంలో ‘లవ్‌రాత్రి’ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఆయుష్‌ శర్మ, వరీన హుస్సేన్‌కు విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు ధోని. ఈ సినిమా అక్టోబర్‌ 5వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీరు రాంచీలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారు. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితాఖాన్‌ భర్త ఆయుశ్ శర్మ ‘లవ్‌రాత్రి’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేస్తున్నాడు.

ఎంఎస్‌ ధోని - సల్మాన్‌ఖాన్‌ చాలా మంచి స్నేహితులు. ఆయుశ్‌ శర్మ రాంచీ వస్తున్నాడని తెలుసుకున్న ధోని తన నివాసంలో ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయనతో పాటు వరీన హుస్సేన్‌ను ఆహ్వానించాడట. లవ్‌రాత్రి చిత్రానికి సల్మాన్‌ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top