‘పెద్ద పనికి.. చిన్న సాయం ఎప్పుడూ ప్రత్యేకమే’

MS Dhoni Clean His New Car Along With Daughter Ziva - Sakshi

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనికి కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే. ఇటీవలే తన కార్ల లిస్టులో ‘నిసాన్‌ జొంగా’ జీప్‌ను కూడా చేర్చేశాడు మిస్టర్‌ కూల్‌. ఇక కూతురు జీవా కూడా తండ్రి బాటలోనే వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది ఈ వీడియో చుస్తుంటే. దీపావళి సందర్భంగా ధోని.. కూతురు జీవాతో కలిసి తన కొత్త జీప్‌ను శుభ్రం చేస్తున్న వీడియోను ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

ఇందులో ప్యాంట్‌ను పైకి మడుచుకుని.. చేతిలో వాషింగ్‌ క్లాత్‌తో ఉన్న ధోని, జీవాలను  చూస్తుంటే వారిద్దరు పనిలో చాలా బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పెద్ద పనికి.. చిన్న సాయం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది’ అనే టైటిల్‌తో షేర్‌ చేసిన వీడియోకి.. గంటలోనే దాదాపు 7 లక్షల వ్యూస్‌ రాగా వేలల్లో కామెంట్స్‌ వచ్చాయి. ‘మేము కూడా మీకు సాయం చేస్తాం ప్లీజ్‌, నిరాండబరత చాలా ఉత్తమమైంది’  అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

అలాగే ఎంఎస్‌ ధోనీ భార్య సాక్షి కూడా జీవా జొంగా కారుపై కుర్చుని నవ్వుతున్న ఫోటోతో పాటు, కారుపై ఉన్న చిన్ననాటి ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘అవర్‌ డాడ్స్‌ రైడ్‌’  అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన పోస్ట్‌కి టన్నుల కొద్ది హార్ట్‌ ఎమోజీలు రాగా ‘జీవా అచ్చం తల్లీ సాక్షీ’ లాగే ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ పెడుతున్నారు. అయితే మిస్టర్‌ కూల్‌ ‘నిస్సాన్‌ జోంగా’పై తన స్వస్థలం రాంచీలో చక్కర్లు కొట్టిన వార్త కొన్ని రోజుల పాటు హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ‘నిస్సాన్‌ జోంగా’  జీప్‌ను భారత సైన్యం కోసం ప్రత్యేకంగా తయారు చేయించినది కావడంతో ధోని దానిని వాడటం ఆపేసినట్లు తెలుస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top