బాత్‌రూంలో కూడా ఇంత కూల్‌గా ఎలా?

MS Dhoni Chats With Singer Rahul Vaidya In Bathroom - Sakshi

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి మరోపేరు మిస్టర్‌ కూల్‌. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఒత్తిడికి గురికాకుండా కూల్‌గానే ఉంటూ తన పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులను బురిడీ కొట్టించగలడు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తన ఆటతీరుతో ధోని విమర్శల పాలైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగిసిన తర్వాత భారత్‌కు చేరుకున్న ధోని.. ఎన్సీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ కూతురు పూర్ణా పటేల్‌ వివాహ వేడుకకు భార్య సాక్షి, కూతురు జివాలతో హాజరై అక్కడ తన స్నేహితులతో సరదాగా గడిపాడు. వేడుక మధ్యలో బాత్‌రూమ్‌లో ధోనితో సరదగా గడిపిన సన్నివేశాలను ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ రాహుల్‌ వైద్య వీడియో తీసి అభిమానులతో పంచుకున్నాడు.

వీడియోలో రాహుల్‌ తనతో పాటు ధోనిని చూపిస్తూ ‘మీరు బాత్‌రూమ్‌ కూడా ఇంత కూల్‌గా ఎలా ఉంటారు‌‌?’ అని అడిగాడు. దానికి బదులుగా ధోని ‘ఏమో నాకు తెలీదు’ అన్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. పార్టీలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ధోని పెళ్లి వేడుకలో తన కూతురితో కలిసి డాన్స్‌ చేశాడు. అదే సమయంలో సహచర క్రికెటర్లు, సినిమా నటులు, సెలబ్రిటీలతో చాలా సేపు మాట్లాడాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top