క్రికెట్‌కు జాన్సన్‌ గుడ్‌బై

Mitchell Johnson Retires From All Forms of Cricket - Sakshi

సిడ్నీ: అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్సన్‌ ప్రకటించాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆసీస్‌ ప్లేయర్‌ ఇప్పటి వరకు కొన్ని దేశవాళి టీ20 లీగ్‌ల్లో ఆడాడు. ఇక నుంచి టీ20 లీగ్‌ల్లో సైతం ఆడనని ఆదివారం స్పష్టం చేశాడు.

‘ఇక నా క్రికెట్‌ కెరీర్‌ అయిపోయింది. నేను నా చివరి బంతి వేసాను. చివరి వికెట్‌ను కూడా తీసుకున్నాను. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఈ రోజు ప్రకటిస్తున్నా. నేనింకా కొన్ని రోజులు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో ఆడుతానని భావించాను. కానీ నాశరీరం అందుకు సహకరించడం లేదు. పూర్తిగా అలసిపోయాను. ఈ ఏడాది ఐపీఎల్‌లో నాకు కలిగిన వెన్ను నొప్పి ఆటను ముగించాలని నన్ను హెచ్చిరించింది. దీంతో నా క్రికెట్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నాను. మిగిలిన నా జీవితాన్ని ఆస్వాదిస్తాను.’ అని చెప్పుకొచ్చాడు. ఈ ఆసీస్‌ ప్లేయర్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. 

కెరీర్‌లో 73 టెస్టుల్లో 313, వన్డేల్లో 153 మ్యాచుల్లో 239, టీ20ల్లో 38 వికెట్లను జాన్స‌న్ పడగొట్టాడు. ఆసీస్ త‌ర‌ఫున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జాన్సన్‌ 2015లో త‌న చివ‌రి టెస్టు, వ‌న్డేను ఆడాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top