దావన్‌ స్థానంలో మయాంక్‌! | Mayank Agarwal Likely To Replace Injured Shikhar Dhawan In ODIs Against West Indies | Sakshi
Sakshi News home page

దావన్‌ స్థానంలో మయాంక్‌!

Dec 11 2019 4:44 AM | Updated on Dec 11 2019 4:44 AM

Mayank Agarwal Likely To Replace Injured Shikhar Dhawan In ODIs Against West Indies  - Sakshi

న్యూఢిల్లీ: మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు. ధావన్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ జట్టులోకి వచ్చే అవకాశముంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ఈనెల 15న చెన్నైలో... రెండో వన్డే 18న విశాఖపట్నంలో... మూడో వన్డే 22న కటక్‌లో జరుగుతాయి. ‘ధావన్‌ కోలుకోకపోవడంతో... టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో చర్చించి అతని స్థానంలో మయాంక్‌ పేరును సెలక్షన్‌ కమిటీ ప్రతిపాదించింది’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement