ఫైనల్ కు చేర్చిన మనీష్ | Manish Pandey stars in India A's one-wicket win over South Africa A | Sakshi
Sakshi News home page

ఫైనల్ కు చేర్చిన మనీష్

Aug 4 2017 3:38 PM | Updated on Sep 17 2017 5:10 PM

ఫైనల్ కు చేర్చిన మనీష్

ఫైనల్ కు చేర్చిన మనీష్

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత్-ఎ జట్టు ఫైనల్ కు చేరింది.

ప్రిటోరియా: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత్-ఎ జట్టు ఫైనల్ కు చేరింది. దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన మ్యాచ్ లో భారత-ఎ జట్టు వికెట్ తేడాతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. భారత్ విజయంలో కెప్టెన్ మనీష్ పాండే(93 నాటౌట్; 85 బంతులు) కీలక పాత్ర పోషించాడు. మనీష్ చివరి వరకూ క్రీజ్ లో ఉండటంతో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇంకా రెండు బంతులుండగానే ఛేదించింది.

 

అతనికి జతగా సంజూ శాంసన్(68) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇది భారత్ కు వరుసగా మూడో విజయం. తొలి మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ జట్టు.. ఆపై హ్యాట్రిక్ విజయాలు సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. మంగళవారం దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement