డీఎన్‌ఏ నమూనా ఇవ్వండి... రొనాల్డోకు పోలీసుల వారెంట్‌ 

Las Vegas police seeking soccer player Cristiano Ronaldo DNA - Sakshi

లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపేందుకు డీఎన్‌ఏ నమూనాలు ఇవ్వాలని లాస్‌వెగాస్‌ పోలీసులు ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఆటగాడు, పోర్చుగల్‌ జట్టు కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డోను కోరారు. 2009 జూన్‌ 13న హోటల్‌ సూట్‌లో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడంటూ అమెరికాకు చెందిన మాజీ మోడల్‌ క్యాథరిన్‌ మోర్గా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని భావిస్తున్న పోలీసులు... హోటల్‌లో దొరికిన క్యాథరిన్‌ దుస్తులను ప్రధాన ఆధారంగా భావిస్తున్నారు.

అందుకే, డీఎన్‌ఏ నమూనాలు కోరుతూ ఇటలీలో లీగ్‌ ఆడుతున్న రొనాల్డోకు వారెంట్‌ పంపారు. మరోవైపు ఘటనను బయటకు చెప్పకుండా ఉండేందుకు క్యాథరిన్‌కు 3.75 లక్షల అమెరికన్‌ డాలర్లు చెల్లించేందుకు అప్పట్లోనే అంగీకారం కుదిరింది. అయితే, ‘మీ టూ’ ఉద్యమ ప్రభావంతో ఆమె మళ్లీ నోరు విప్పింది. రొనాల్డో, అతడి న్యాయవాదులు ఈ అభియోగాలను మొదటి నుంచి ఖండిస్తున్నారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top