
కుంబ్లే లెఫ్టార్మ్ స్పిన్‌తో...
అనిల్ కుంబ్లే జగద్విఖ్యాత లెగ్ స్పిన్నర్‌గానే మనకందరికీ తెలుసు.
తప్పులు సరిదిద్దుకున్న పుజారా
రాంచీ: అనిల్ కుంబ్లే జగద్విఖ్యాత లెగ్ స్పిన్నర్‌గానే మనకందరికీ తెలుసు. ప్రస్తుత భారత జట్టు ప్రధాన కోచ్‌గా కీలక పాత్ర పోషిస్తున్న కుంబ్లే, ఒక బౌలర్‌గా కూడా నెట్స్‌లో జట్టుకు ఎంతో సహకరిస్తున్నారు. అయితే బెంగళూరు టెస్టుకు ముందు ఆయన, చతేశ్వర్ పుజారాతో చేయించిన ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడింది.
పుజారాకు సహకరించేందుకు కుంబ్లే అనూహ్యంగా లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా మారిపోవడం విశేషం. పుణే టెస్టులో పుజారాను ఇబ్బంది పెట్టిన ఒకీఫ్‌ను ఎదుర్కొనేందుకు జంబో ఈ తంత్రం ప్రయోగించారు. బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజారా చేసిన 92 పరుగులు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి.