సంగక్కర సరికొత్త రికార్డు | Kumar Sangakkara registers fifth successive century in first class cricket | Sakshi
Sakshi News home page

సంగక్కర సరికొత్త రికార్డు

May 27 2017 3:15 PM | Updated on Nov 9 2018 6:43 PM

సంగక్కర సరికొత్త రికార్డు - Sakshi

సంగక్కర సరికొత్త రికార్డు

ఇటీవల తన దేశవాళీ రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇంకా అత్యుత్తమ ఫామ్లోనే కొనసాగుతున్నాడు.

చెమ్స్ ఫోర్ట్: ఇటీవల తన దేశవాళీ క్రికెట్ కెరీర్ కు సంబంధించి రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఇంకా అత్యుత్తమ ఫామ్లోనే కొనసాగుతున్నాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో భాగంగా సర్రే తరపున ఆడుతున్న సంగక్కర అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఎసెక్స్ తో మ్యాచ్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో సంగక్కర(177 బ్యాటింగ్;) భారీ సెంచరీ సాధించాడు. తద్వారా కౌంటీ చాంపియన్ షిప్ లో సర్రే తరపున వరుసగా ఐదు సెంచరీలు చేసిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.  అంతకుముందు సంగక్కర(136, 105, 114, 120) వరుస శతకాలతో మెరిశాడు.  ఇదిలా ఉంచితే, సంగక్కరకు ఇది 99వ సెంచరీ కావడం మరో విశేషం. ఇందులో 61 ఫస్ట్ క్లాస్ సెంచరీలుండగా, 38 లిస్ట్-ఎ సెంచరీలున్నాయి.

మరో నాలుగు నెలలు మాత్రమే క్రికెట్ ఆడుతున్నట్లు సంగక్కర ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ తరువాత దేశవాళీ క్రికెట్ నుంచి సైతం వీడ్కోలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. దాదాపు రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగక్కరకు వయసు పైబడటంతో గేమ్ నుంచి పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement