కోహ్లి.. నీ సమాధానంతో ఆ కామెంటేటర్‌ దిమ్మతిరిగింది!

Kohli Takes a Subtle Dig at Australian Commentator - Sakshi

సోషల్‌ మీడియాలో అభిమానులు

మెల్‌బోర్న్‌ : భారత ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ కెరీ ఓ కీఫ్‌కు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడని సోషల్‌ మీడియాలో అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. అరంగేట్ర ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ను ఉద్దేశిస్తూ కెరీ ఓ కీఫ్‌ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  మూడో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా ‘జలంధర్‌ రైల్వే క్యాంటీన్‌ నౌకర్ల’ బౌలింగ్‌లో మయాంక్‌ రంజీ ట్రిపుల్‌ సెంచరీ చేసి ఉంటాడని ఓ కీఫ్‌ కామెంట్‌ చేశాడు. అయితే ఈ టెస్ట్‌ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘మా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అద్భుతం. దానివల్లే మేం ఈ విజయం సాధించాం. ఈ గెలుపు క్రెడిట్‌ కచ్చితంగా భారత ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ విధానందే. అక్కడ మా బౌలర్లకు ఎదురైన సవాళ్లు విదేశాల్లో రాణించేలా చేశాయి’ అని ఫస్ట్‌ క్రికెట్‌ విధానాన్ని కోహ్లి కొనియాడాడు.

అయితే ఓ కీఫ్‌ జాతి వివక్ష వ్యాఖ్యలను ఉద్దేశించే కోహ్లి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో బంతితో చెరేగి మ్యాన్‌ఆప్‌దిమ్యాచ్‌గా నిలిచిన భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సైతం భారత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ను కొనియాడాడు. రంజీ క్రికెట్‌లో చాలా బంతులు వేయడం వల్లే ఆ అనుభవం ఇక్కడ ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. ఇక ఓ కీఫ్‌  తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా.. నాలుగో రోజు ఆటలో భారత్‌ ఆటగాళ్లపై మళ్లీ మాట తూలాడు. ఒక రకమైన వ్యంగ్య శైలితో మాట్లాడుతూ ‘అసలు మీ పిల్లలకు చతేశ్వర్‌ జడేజా వంటి పేర్లు ఎలా పెడతారు’ అంటూ ఇద్దరు భారత క్రికెటర్ల పేర్లను మిళితం చేశాడు. దీంతో ఓ కీఫ్‌ తీరుపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top