తొలి క్రికెటర్‌గా పొలార్డ్‌ రికార్డు! | Kieron Pollard becomes first player to feature in 400 T20s | Sakshi
Sakshi News home page

తొలి క్రికెటర్‌గా పొలార్డ్‌ రికార్డు!

Jan 25 2018 3:11 PM | Updated on Jan 25 2018 3:11 PM

Kieron Pollard becomes first player to feature in 400 T20s - Sakshi

సిడ్నీ: వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు కీరోన్‌ పొలార్డ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌ ట్వంటీ 20 ఫార్మాట్‌లో 400లకు పైగా మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌ బాష్‌లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పొలార్డ్‌ ఈ ఘనత సాధించాడు.  బీబీఎల్‌ టోర్నీలో భాగంగా బుధవారం సిడ్నీ థండర్స్‌తో పొలార్డ్‌ ఆడిన మ్యాచ్‌ తన కెరీర్‌లో 401వ టీ20 మ్యాచ్‌ను ఆడాడు.

ఫలితంగా నాలుగు వందలకు పైగా ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రావో(372), క్రిస్‌ గేల్‌(323) ఉన్నారు.401 టీ20లు ఆడిన పొలార్డ్‌ 361 ఇన్నింగ్స్‌ల ద్వారా 7,853 పరుగులు సాధించాడు. ఇందులో 39 అర్ధశతకాలు ఉన్నాయి. అటు బౌలర్‌గా 274 ఇన్నింగ్స్‌ల్లో 245 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు‌.

పొట్టి ఫార్మాట్‌లో ముంబయి ఇండియన్స్‌, బార్బడోస్‌ ట్రిడెంట్స్‌ అండ్‌ ట్రినిడాడ్‌ టొబాగో, కేప్‌ కో బ్రాస్‌, ఢాకా డైనమైట్స్‌, ఢాకా గ్లాడియేటర్స్‌, కరాచీ కింగ్స్‌, సోమర్‌సెట్‌ అండ్ సౌత్‌ ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ ఇలా  తదితర జట్ల తరపున పొలార్డ్‌ టీ20లు ఆడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement