శ్రీకాంత్ తొమ్మిదో ర్యాంకు పదిలం | Kidami Srikanth remains World No. 9, PV Sindhu slips to 12th | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్ తొమ్మిదో ర్యాంకు పదిలం

Feb 4 2016 7:29 PM | Updated on Sep 3 2017 4:57 PM

శ్రీకాంత్ తొమ్మిదో ర్యాంకు పదిలం

శ్రీకాంత్ తొమ్మిదో ర్యాంకు పదిలం

ఇటీవల సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ గోల్డ్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలిచిన భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ తొమ్మిదో ర్యాంకును నిలుపుకున్నాడు.

న్యూఢిల్లీ: ఇటీవల సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ గోల్డ్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలిచిన భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ తొమ్మిదో ర్యాంకును నిలుపుకున్నాడు. గురువారం బీడబ్యూఎఫ్(బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్) విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో శ్రీకాంత్ తన ర్యాంకును పదిలంగా ఉంచుకోగా, భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఒక స్థానం దిగజారి 12 స్థానానికి పడిపోయింది. ఇదిలా ఉండగా, భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రెండో ర్యాంకును కాపాడుకుంది.

సయ్యద్ మోదీ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచిన భారత ద్వయం ప్రణవ్ జెర్రీ చోప్రా-అక్షయ్ దివాల్కర్ లు రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 34వ ర్యాంక్ లో నిలిచారు. మరోవైపు పారుపల్లి కశ్యప్ 15 వ స్థానానికి పడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement