భారత్‌కు నిరాశ

 Kazakhstan proves too strong for India - Sakshi

కజకిస్తాన్‌ చేతిలో ఓటమి

అస్తానా (కజకిస్తాన్‌): ఫెడ్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌నకు అర్హత సాధించాలని ఆశించిన భారత మహిళల టెన్నిస్‌ జట్టుకు నిరాశ ఎదురైంది. కజకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన ఆసియా–ఓసియానియా గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 0–3తో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో కర్మన్‌కౌర్‌ 3–6, 2–6తో జరీనా దియాస్‌ చేతిలో ఓటమి చవిచూసింది.  రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ అంకిత రైనా 1–6, 6–7 (4/7)తో ప్రపంచ 43వ ర్యాంకర్‌ యులియా పుతిన్‌సెవా చేతిలో పరాజయం పాలైంది.

దాంతో కజకిస్తాన్‌ విజయం ఖాయమైంది. నామమాత్రమైన డబుల్స్‌ మ్యాచ్‌లో రియా భాటియా–ప్రార్థన ద్వయం 1–6, 1–6తో అనా డానిలినా–గలీనా వొస్కోబొయేవా జంట చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం పరిపూర్ణమైంది. గ్రూప్‌ ‘ఎ’లో రెండు విజయాలో కజకిస్తాన్‌ ‘టాపర్‌’గా నిలిచింది. భారత్‌ రెండో స్థానంలో, థాయ్‌లాండ్‌ మూడో స్థానంలో నిలిచాయి. నేడు జరిగే 3–4 ప్లే ఆఫ్‌ స్థానా ల కోసం కొరియాతో భారత్‌ ఆడుతుంది. వరల్డ్‌ గ్రూప్‌ బెర్త్‌ కోసం కజకిస్తాన్, చైనా తలపడతాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top