ఫుట్‌బాల్ జట్టుపై ధోని దృష్టి | John Abraham, Mahendra Singh Dhoni may buy IMG-Reliance football franchise | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ జట్టుపై ధోని దృష్టి

Aug 29 2013 2:00 AM | Updated on Oct 2 2018 8:39 PM

ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని... ఒక జట్టును కొనాలనే ఆలోచనలో ఉన్నాడు. భారత్‌లో త్వరలో ఐపీఎల్ తరహాలో ఫుట్‌బాల్ లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

న్యూఢిల్లీ: ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని... ఒక జట్టును కొనాలనే ఆలోచనలో ఉన్నాడు. భారత్‌లో త్వరలో ఐపీఎల్ తరహాలో ఫుట్‌బాల్ లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త లీగ్‌లో ఓ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవాలని మహీ భావిస్తున్నట్లు సమాచారం.

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, ధోని కలిసి జట్టును కొనే అవకాశం ఉందని లీగ్ వర్గాలు తెలిపాయి. ‘ధోని, జాన్ మంచి స్నేహితులు. ఈ లీగ్‌లో పెట్టుబడి పెట్టేందుకు జాన్ ఇప్పటికే బాగా ఆసక్తి చూపుతున్నాడు. ధోనితో కలిసి టీమ్ కొనాలని అనుకుంటున్నాడు’ అని లీగ్ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి మార్చి 30 లోపు ఈ లీగ్ జరిగే అవకాశం ఉంది. ఇందులో పాల్గొనే జట్ల కోసం సెప్టెంబరులో వేలం నిర్వహిస్తారు. మరోవైపు ఇదే లీగ్‌లో కోల్‌కతా జట్టును కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు షారూఖ్ ఖాన్ గతంలో చెప్పాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement