'బూమ్రా, చాహల్ ను పరిగణలోకి తీసుకోండి' | Jasprit Bumrah And Yuzvendra Chahal Are Ready For Tests: Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

'బూమ్రా, చాహల్ ను పరిగణలోకి తీసుకోండి'

Nov 9 2017 11:49 AM | Updated on Nov 9 2017 11:49 AM

Jasprit Bumrah And Yuzvendra Chahal Are Ready For Tests: Sunil Gavaskar - Sakshi

న్యూఢిల్లీ: భారత జట్టులోకి వచ్చిన అతి తక్కువ సమయంలోని కీలక ఆటగాళ్లకు మారిపోయిన పేసర్ జస్ఫ్రిత్ బూమ్రా, స్సిన్నర్ యజ్వేంద్ర చాహల్ కు దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ మద్దతు లభించింది. ఇక వీరిద్దర్నీ టెస్టు జట్టులో తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ పరిమిత ఓవర్ల క్రికెట్ లో విశేషంగా రాణిస్తున్నా టెస్టు జట్టులో మాత్రం ఇంకా చోటు దక్కించుకోలేదు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో బూమ్రా-చాహలు రాణించి సిరీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

ఈ నేపథ్యంలో వారి గురించి గావస్కర్ మాట్లాడుతూ.. ' వారిద్దరూ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. గత కొంతకాలంగా వారు జట్టులో ప్రధాన భూమిక పోషిస్తూ అమోఘంగా రాణిస్తున్నారు. వారి ఐపీఎల్ అనుభవం అంతర్జాతీయ మ్యాచ్ ల్లో బాగా కనబడుతోంది. బంతుల్ని ఎక్కడ సంధించి బ్యాట్స్ మెన్ ను ఎలా ఇబ్బంది పెట్టాలనేది వారికి బాగా వంటబట్టింది. ప్రధానంగా డెత్ ఓవర్లలో వారు పరుగులివ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇక వారికి టెస్టుల్లో అరంగేట్రం చేసే సమయం ఆసన్నమైంది. భారత్ ఆడబోయే టెస్టు సిరీస్ ల్లో వారిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది'అని గావస్కర్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement