ఫాల్కనర్, షాన్ మార్ష్లకు నో ప్లేస్! | James Faulkner, Shaun Marsh miss out on Cricket Australia contracts | Sakshi
Sakshi News home page

ఫాల్కనర్, షాన్ మార్ష్లకు నో ప్లేస్!

Apr 25 2017 5:00 PM | Updated on Sep 5 2017 9:40 AM

ఫాల్కనర్, షాన్ మార్ష్లకు నో ప్లేస్!

ఫాల్కనర్, షాన్ మార్ష్లకు నో ప్లేస్!

ఆస్ట్రేలియా క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాలో ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ తో పాటు వెటరన్ బ్యాట్స్మన్ షాన్ మార్ష్కు చోటు దక్కలేదు.

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ల కాంట్రాక్ట్ జాబితాలో ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ తో పాటు వెటరన్ బ్యాట్స్మన్ షాన్ మార్ష్కు చోటు దక్కలేదు. 2017-18 సంవత్సరానికిగాను ప్రకటించిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ లిస్ట్లో వీరిద్దర్నీ పక్కన పెట్టేశారు. 2013 నుంచి ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ లో రెగ్యులర్ సభ్యునిగా కొనసాగుతున్న ఫాల్కనర్ కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యకర పరిణామం.  మరొకవైపు ఇటీవల భారత పర్యటనలో విశేషంగా రాణించి 19 వికెట్లు తీసిన స్టీవ్ ఓకీఫ్ కు కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కుతుందని తొలుత భావించినా చివరకు అతనికి కూడా నిరాశే ఎదురైంది.

 

ఇదిలా ఉంచితే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కొత్త ముఖం కార్ట్ రైట్ తో పాటు ఇంకా  టెస్టుల్లో అరంగేట్రం చేయని ఫాస్ట్ బౌలర్ బిల్లీ స్టాన్ లేక్లకు కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కడం ఇక్కడ విశేషం. రాబోవు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల సిరీస్లను దృష్టిలో ఉంచుకుని మాత్రమే 20 మందికి కాంట్రాక్ట్ జాబితాలో చోటు కల్పించినట్లు సీఏ సెలక్షన్ చైర్మన్ ట్రావెర్ హాన్స్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement