ఏసెస్‌తో స్లామర్స్‌ అమీతుమీ | IPTL 2016: Indian Aces Lose 20-24 to UAE Royals Before Final | Sakshi
Sakshi News home page

ఏసెస్‌తో స్లామర్స్‌ అమీతుమీ

Dec 11 2016 2:10 AM | Updated on Sep 4 2017 10:23 PM

ఏసెస్‌తో స్లామర్స్‌ అమీతుమీ

ఏసెస్‌తో స్లామర్స్‌ అమీతుమీ

అంతర్జాతీయ ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్‌ (ఐపీటీఎల్‌) మూడో సీజన్‌ చాంపియన్‌ ఎవరో నేడు తేలనుంది.

ఐపీటీఎల్‌–2016
సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్‌ (ఐపీటీఎల్‌) మూడో సీజన్‌ చాంపియన్‌ ఎవరో నేడు తేలనుంది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగే ఫైనల్లో మాజీ చాంపియన్‌ ఇండియన్‌ ఏసెస్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ సింగపూర్‌ స్లామర్స్‌ అమీతుమీ తేల్చుకుంటుంది. శనివారం లీగ్‌ దశ పోటీలు ముగిశాక ఏసెస్‌ 18 పాయింట్లతో అగ్రస్థానంలో, సింగపూర్‌ స్లామర్స్‌ 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. చివరి రౌండ్‌లో ఇండియన్‌ ఏసెస్‌ 20–24తో యూఏఈ రాయల్స్‌ చేతిలో ఓడిపోగా... సింగపూర్‌ స్లామర్స్‌ 30–20తో జపాన్‌ వారియర్స్‌పై గెలిచింది.

రాయల్స్‌తో జరిగిన పోటీలో మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో రోహన్‌ బోపన్న–సానియా మీర్జా (ఏసెస్‌) ద్వయం 3–6తో నెస్టర్‌–అనా ఇవనోవిచ్‌ జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల లెజెండ్స్‌ సింగిల్స్‌లో ఫిలిప్పోసిస్‌ (ఏసెస్‌) 2–6తో జొహాన్సన్‌ చేతిలో ఓటమి చెందగా... మహిళల సింగిల్స్‌లో ఫ్లిప్‌కెన్స్‌ (ఏసెస్‌) 6–3తో ఇవనోవిచ్‌పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న–ఇవాన్‌ డోడిగ్‌ (ఏసెస్‌) జోడీ 6–3తో క్యూవాస్‌–నెస్టర్‌ జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో డోడిగ్‌ (ఏసెస్‌) 3–6తో బెర్డిచ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement