భారత్‌కు విజయావకాశం!

India's success to India - dravid - Sakshi

దక్షిణాఫ్రికా సిరీస్‌పై ద్రవిడ్‌

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుకు దక్షిణాఫ్రికాలో తొలిసారి టెస్టు సిరీస్‌ గెలిచే అవకాశాలున్నాయని మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంటున్నాడు. ‘మనకు ఆల్‌రౌండర్‌ హార్డిక్‌ పాండ్యాతో పాటు నాణ్యమైన స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఉన్నారు. అన్నిటికి మించి బ్యాట్స్‌మెన్‌కు 40–50 టెస్టులాడిన అనుభవం ఉంది. అక్కడి పరిస్థితుల్లో కొద్దిగా అదృష్టంతో పాటు పచ్చిక పిచ్‌లపై కొన్ని అవకాశాలు దక్కితే చాలు గెలవగలం’ అని పేర్కొన్నాడు.

మైదానంలో కోహ్లి చూపే తీవ్రత సహచరులకు స్ఫూర్తినిస్తుందని, అదే అతడిని ఇతరుల కంటే భిన్నంగా నిలుపుతుందని ద్రవిడ్‌ విశ్లేషించాడు. కష్టమైనా.. సమన్వయం చేసుకోగలిగితే బిజీ షెడ్యూల్‌ భారం కాదని వివరించాడు. భారత అండర్‌–19 కుర్రాళ్లు నేర్చుకునే దశలో ఉన్నం దున ఈ స్థితిలో విజయాలను ఆశించకూడదని అన్నాడు. ఇప్పు డు దృష్టంతా అండర్‌–19 ప్రపంచకప్‌పైనే ఉందని తెలిపాడు.

Back to Top