ఎట్టకేలకు భారత ఓపెనర్లు కీలక మ్యాచ్లో రాణిస్తున్నారు.
పెర్త్: ఎట్టకేలకు భారత ఓపెనర్లు కీలక మ్యాచ్లో రాణిస్తున్నారు. ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రహానె (43 నాటౌట్), ధవన్ (38 నాటౌట్) హాఫ్ సెంచరీల దిశగా దూసుకెళ్తున్నారు.
ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ను ఓపెనర్లు ఆదుకున్నారు.