వాలీబాల్‌ ఫైనల్లో భారత్‌

India Beat Sri Lanka In Volleyball Semifinals - Sakshi

దక్షిణాసియా క్రీడలు ప్రారంభం  

కఠ్మాండు (నేపాల్‌): దక్షిణాసియా క్రీడల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత పురుషుల వాలీబాల్‌ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 27–25, 25–19, 21–25, 25–21తో శ్రీలంకపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో పాకిస్తాన్‌ 25–15, 25–21, 26–24తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దీంతో దాయాది దేశాలైన భారత్, పాక్‌ల మధ్య వాలీబాల్‌ టైటిల్‌ పోరు జరగనుంది.

మహిళల విభాగంలోనూ డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన భారత్‌ తుదిపోరులో నేపాల్‌తో తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు మంగళవారం జరుగుతాయి. సెమీస్‌లో మహిళల జట్టు మాల్దీవులపై నెగ్గగా,  శ్రీలంకపై నేపాల్‌ గెలిచింది. పలు క్రీడాంశాల్లో పోటీలు మొదలైనప్పటికీ ఆరం¿ోత్సవ వేడుకలు మాత్రం ఆదివారం లాంఛనంగా జరిగాయి. నేపాల్‌ దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ క్రీడలను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నేపాలీ సంప్రదాయ శైలీలో అట్టహాసంగా వేడుకల్ని నిర్వహించారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top