రెండో రౌండ్‌లో అబ్దుల్లా | IN the second round, sheik abdullah | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో అబ్దుల్లా

Sep 12 2013 1:08 AM | Updated on Sep 1 2017 10:37 PM

అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) ప్రైజ్‌మనీ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో షేక్ అబ్దుల్లా, రిషబ్ అగర్వాల్ శుభారంభం చేయగా... పార్థసారథి తొలి రౌండ్‌లో ఓడిపోయాడు.

బెంగళూరు: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) ప్రైజ్‌మనీ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో షేక్ అబ్దుల్లా, రిషబ్ అగర్వాల్ శుభారంభం చేయగా... పార్థసారథి తొలి రౌండ్‌లో ఓడిపోయాడు.
 
 బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో షేక్ అబ్దుల్లా 7-6 (7/3), 7-3తో మూడో సీడ్ సౌరవ్(పశ్చిమ బెంగాల్) పై; రిషబ్ 6-1, 6-1తో అజయ్‌పై గెలుపొందగా... పార్థసారథి 1-6, 3-6తో సూరజ్ చేతిలో ఓడిపోయాడు. మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మౌళిక రామ్ 1-6, 4-6తో అద్న్యా నాయక్ చేతిలో ఓటమి పాలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement