‘భారత పౌరసత్వం’పై రషీద్‌ స్పందన..

I will stay in my country, Rashid Khan - Sakshi

ముంబై : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్.. ఇప్పడు హాట్ టాపిక్ అయ్యాడు. తన అద్భుత  స్పిన్‌ మ్యాజిక్‌కు తోడు, మెరుపు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌తో ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన అతడికి భారత క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు. దీంతో కొందరు అభిమానులు రషీద్‌కు భారత పౌరసత్వం ఇచ్చి.. టీమిండియాలోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని కూడా స్పందించిన విషయం తెలిసిందే.
 
దీనిపై అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అతీఫ్ మషల్ ఓ ట్వీట్‌ చేశాడు. ‘‘రషీద్‌ ఖాన్ కోసం ఆఫర్ చేస్తున్నవారందరికీ థ్యాంక్స్. ప్రపంచ వ్యాప్తంగా అతడికెంత డిమాండ్ ఉందో నాకు తెలుసు. కానీ, అతడు ఎక్కడికీ వెళ్లడు. ఎందుకంటే.. అతడు అఫ్గానిస్తాన్ దేశస్థుడిగానే గర్వపడుతున్నాడు’’ అని ట్వీట్ చేశాడు.
 
అందుకు రషీద్ ఖాన్ బదులిస్తూ ..‘ఖచ్చితంగా.. మిస్టర్ చైర్మన్. నేను అఫ్గానిస్తాన్ పౌరుడిగా గర్వపడుతున్నాను. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. నా దేశం కోసం పోరాడుతాను. మేము శాంతిని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం.. ఎందుకంటే అది మా దేశానికి చాలా అవసరం’ అంటూ రషీద్ బదులిచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top