ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు: జడేజా

దుబాయ్: దాదాపు 480 రోజుల తర్వాత టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కించుకుని అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగిపోయిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. తన ప్రదర్శనపై ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతోనే ఉంటానన్నాడు. ఆసియాకప్‌లో భాగంగా శుక‍్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. దీనిపై జడేజా మాట్లాడుతూ.. ‘ నా పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవడాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కించుకుని ఆకట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది.
నా ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. నేను ఇంకా రాటుదేలాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఏమి చేయగలను అనే విషయంలో ఎవరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు నేనే చాలెంజ్’ అని జడేజా పేర్కొన్నాడు. వచ్చే వరల్డ్‌కప్‌లో స్థానంపై అడిగిన ప్రశ్నపై జడేజా స్పందిస్తూ.. ఇప్పుడే దాని గురించి ఆలోచించడం లేదన్నాడు. ఆ మెగా టోర్నీ నాటికి తామింకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, అప్పటి పరిస్థితుల్ని జట్టు కూర్పు ఉంటుందన్నాడు. ప‍్రస‍్తుతం తన ఫోకస్ అంతా తాజా సిరీస్‌పైనే ఉన‍్నట్లు తెలిపాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి