హైదరాబాద్ భారీ విజయం | Huge success for Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ భారీ విజయం

Oct 14 2014 1:42 AM | Updated on Sep 2 2017 2:47 PM

హైదరాబాద్ భారీ విజయం

హైదరాబాద్ భారీ విజయం

గుంటూరు స్పోర్ట్స్: బీసీసీఐ సౌత్‌జోన్ అండర్-19 మహిళల అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు భారీ విజయం సాధించింది.

గుంటూరు స్పోర్ట్స్: బీసీసీఐ సౌత్‌జోన్ అండర్-19 మహిళల అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు భారీ విజయం సాధించింది. కేరళతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 176 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టి 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.

రమ్య (113 బంతుల్లో 87), రచన (24 బంతుల్లో 31నాటౌట్), అరుంధతిరెడ్డి (31 బంతుల్లో 27), స్నేహమోరె (38 బంతుల్లో 26 పరుగులు) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కేరళ జట్టు 24.4 ఓవర్లలో 71 పరుగులకు ఆలౌటైంది. కేరళ జట్టులో సుమి 23, అక్షయ 16 పరుగులు చేశారు. హైదరాబాద్ జట్టులో రచన అద్భుతమైన బౌలింగ్‌తో 12 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టింది. గీతాంజలి 14 పరుగులకు 3 వికెట్లు తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement