చాంపియన్‌ హిమాన్షు | Himanshu reigns supreme in snooker | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ హిమాన్షు

Nov 6 2018 10:13 AM | Updated on Nov 6 2018 10:13 AM

Himanshu reigns supreme in snooker - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ స్నూకర్, బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌లో హిమాన్షు జైన్‌ విజేతగా నిలిచాడు. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ)లో జరిగిన ఈ టోర్నీలో సీనియర్‌ స్నూకర్‌ విభాగంలో హిమాన్షు టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

సోమవారం జరిగిన ఫైనల్లో హిమాన్షు 5–3 ఫ్రేమ్‌ల తేడాతో (38–93, 73–16, 40–66, 79–29, 76–0, 59–66, 74–42, 85–0) మొహమ్మద్‌ గౌస్‌పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో హిమాన్షు 87–13, 86–4, 82–34, 85–4, 65–47తో ముస్తాక్‌పై గెలుపొందగా, గౌస్‌ 51–64, 9–61, 55–26, 43–54, 64–11, 39–84, 61–43, 62–30, 70–12తో నబిల్‌ను ఓడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement