మెరిసిన హిమదాస్‌

Hima Das WonThe Silver Medal In Asian Games - Sakshi

మారథాన్‌లో భారత్‌కు రెండు రజతాలు

జకార్త : ఏషియన్‌ గేమ్స్‌లో హిమదాస్‌ సత్తా చాటింది. హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈ అస్సాం అమ్మాయి రజతం కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్‌ 400 మీటర్ల విభాగంలో 50.79 సెకన్లలో పరుగును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత అథ్లెట్‌ నిర్మల నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. ఆమె 52.96 సెకన్లలో పరుగును పూర్తి చేసి తృటిలో కాంస్యాన్ని చేజార్చుకుంది. ఇక అగ్రస్థానంలో నిలిచిన బెహ్రెయిన్‌ క్రీడాకారిణి నాసెర్‌ సల్వా 50.09 సెకన్లలో పరుగును పూర్తిచేసి స్వర్ణం కైవసం చేసుకుంది. కజకిస్తాన్‌ క్రీడాకారిణి మికినా ఎలినా 52.63 సెకన్లలో పరుగును పూర్తి చేసి కాంస్యం దక్కించుకుంది.

చదవండి: హిమదాస్‌ టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా?

హిమదాస్‌ ఇటీవల అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌ 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం నెగ్గి దేశప్రజల మన్ననలు పొందిన విషయం తెలిసిందే. దీంతో జకార్తాలోనూ ఆమె ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఇక 100 మీటర్ల విభాగంలో భారత రన్నర్‌ ద్యూతీ చంద్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది.

పురుషుల విభాగంలో..
పురుషుల 400 మీటర్ల విభాగంలో సైతం భారత్‌కు రజతం వరించింది. భారత అ‍థ్లెట్‌ యహియా మొహహ్మద్‌ 45.69 సెకన్లలో పరుగును పూర్తి చేసి రజతం దక్కించుకున్నాడు. ఖతర్‌ అథ్లెట్‌ హసన్‌ అబ్దెల్లా(44.89) స్వర్ణం దక్కించుకోగా.. బెహ్రెయిన్‌ క్రీడాకారుడు కమీస్‌ అలీ (45.7) కాంస్యం సొంత చేసుకున్నాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత రన్నర్‌ ఆరోకియారాజీవ్‌ (45.84) నాలుగో స్థానంలో నిలిచాడు.  దీంతో భారత పతకాల సంఖ్య  7 స్వర్ణాలు,9 రజతాలు, 19 కాంస్యలతో కలుపుకొని 35కు చేరుకుంది. ప్రస్తుతం పతకాల జాబితాలో భారత్‌ 9వ స్థానంలో కొనసాగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top