బ్రాడ్‌మన్‌కు గూగుల్‌ ఘన నివాళి

Google remembers Sir Donald Bradman on his 110th birth anniversary - Sakshi

డాన్ బ్రాడ్‌మన్.. క్రికెట్ గురించి తెలిసిన వారికి సుపరిచితమైన పేరిది. నేడు (సోమవారం) ఆయన 110వ జయంతి సందర్భంగా.. ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్ ఘనంగా నివాళులు అర్పించింది. తన డూడుల్ తో మరోసారి ప్రపంచానికి ఆయన్ను గుర్తు చేసింది.  ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా పేరొందిన బ్రాడ్‌మాన్ 1908, ఆగస్టు 27న ఆస్ట్రేలియాలో జన్మించాడు. బ్రాడ్‌మన్ 52 మ్యాచ్‌ల్లో  29 సెంచరీలు సాధించాడు. అందులో 12 డబుల్‌ సెంచరీలు ఉండటం మరో విశేషం. బ్రాడ్‌మన్‌ ఇంగ్లండ్‌పై సాధించిన 334 పరుగులు ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు.

బ్రాడ్‌మన్ బ్యాటింగ్ సగటు 99.94గా ఉంది. చివరి ఇన్నింగ్స్‌లో ఆయన కనీసం 4 పరుగులు చేసి ఉంటే.. యావరేజ్ 100గా ఉండేది. కానీ డకౌట్ కావడంతో 99.94 దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. 1930 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మన్ ఏకంగా 974 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడు బ్రాడ్‌మాన్ (961 పాయింట్లు) కావడం విశేషం.

క్రికెట్‌లోనే అత్యుత్తమ ఆటగాడిగా పేరొందిన బ్రాడ్‌మన్‌కి సచిన్ ఆట అంటే అమితమైన ఇష్టం. మాస్టర్ బ్లాస్టర్ ఆటతీరు అచ్చం బ్రాడ్‌మన్‌ను పోలి ఉండటంతో.. సచిన్ ఆటను ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. బ్రాడ్‌మన్ బర్త్ డే సందర్భంగా.. సచిన్ ఆయన్ను కలిశాడు. ఇదే విషయాన్ని మాస్టర్ బ్లాస్టర్ తాజగా ట్వీట్ చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top