డు ప్లెసిస్‌ అవుట్‌.. కెప్టెన్‌గా ఏబీ | Faf du Plessis ruled out, AB de Villiers leads South Africa vs Zimbabwe | Sakshi
Sakshi News home page

డు ప్లెసిస్‌ అవుట్‌.. కెప్టెన్‌గా ఏబీ

Dec 26 2017 4:18 PM | Updated on Dec 26 2017 4:18 PM

Faf du Plessis ruled out, AB de Villiers leads South Africa vs Zimbabwe - Sakshi

పోర్ట్‌ ఎలిజిబెత్‌: జింబాబ్వేతో జరుగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా రెగ్యులర్‌ కెప్టెన్‌ డు ప్లెసిస్‌ దూరమయ్యాడు. వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా చివరి నిమిషంలో డు ప్లెసిస్‌ జట్టు నుంచి వైదొలిగినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. దాంతో ఈ టెస్టు మ్యాచ్‌కు ఏబీ డివిలియర్స్‌ సారథిగా వ్యవహరిస్తాడని పేర్కొంది. 'గత వారం నుంచి భుజం గాయంతో బాధపడుతున్న డు ప్లెసిస్‌కు వైరల్‌ ఇన్ఫెక్షన్‌ అయ్యింది. అతను కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా టీమిండియాతో జనవరి 5వ తేదీ నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు నాటికి డు ప్లెసిస్‌ జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం' అని జట్టు మేనేజర్‌ మొహ్మద్‌ ముసాజే తెలిపారు.

దాదాపు రెండు సంవత్సరాల పాటు టెస్టు క్రికెట్‌కు దూరమైన ఏబీ డివిలియర్స్‌ జింబాబ్వేతో టెస్టులో బరిలోకి దిగుతున్నాడు. మరొకవైపు డు ప్లెసిస్‌ ఆకస్మికంగా జట్టుకు దూరం కావడంతో ఏబీ డివిలియర్స్‌ జింబాబ్వేతో టెస్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ రోజు(మంగళవారం) ఇరు జట్ల మధ్య నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement