శ్రీలంక 137/1 | Sakshi
Sakshi News home page

శ్రీలంక 137/1

Published Sat, Jun 11 2016 12:46 AM

England Third Test

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు

లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు శుక్రవారం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో  40 ఓవర్లలో వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది. కౌశల్ సిల్వ (64 బ్యాటింగ్), కరుణరత్నే (50) తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించారు. సిల్వతో పాటు కుషాల్ మెండిస్ (15 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు.

అంతకు ముందు 279/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (167 నాటౌట్) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హెరాత్‌కు 4 వికెట్లు దక్కాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement