నా కల నిజమైంది: రిషబ్‌ పంత్‌ | Dream come true to be part of the Indian Test squad, Pant | Sakshi
Sakshi News home page

నా కల నిజమైంది: రిషబ్‌ పంత్‌

Jul 24 2018 11:36 AM | Updated on Jul 24 2018 11:39 AM

Dream come true to be part of the Indian Test squad,  Pant - Sakshi

లండన్‌: త్వరలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడంపై వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ఇదొక అద్భుతమైన అనుభూతిగా రిషబ్‌ పేర్కొన్నాడు. ‘ టీమిండియా టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడం నిజంగా గ్రేట్‌ ఫీలింగ్‌. టెస్టు జట్టులో చోటు దక్కిందనే వార్త వినగానే ఆశ్చర్యానికి లోనయ్యా. భారత టెస్టు జట్టులో చోటు సంపాదించడం అనేది నా కల. అది నెరవేరడంతో సరికొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నా.

ఇక‍్కడ నేనే కాదు.. నా కుటుంబం... నా కోచ్‌ అంతా డబుల్‌ హ్యాపీ.  నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు క్రికెట్‌ పాఠాలు నేర్పిన కోచ్‌ తారెక్‌ సిన్షా సర్‌ కారణం. నాకంటూ ప్రత్యేక గుర్తింపు రావడానికి ఆయనే కారణం. ఆయనెప్పుడూ నన్ను టెస్టు క్రికెటర్‌గా చూడాలని అనుకునే వారు. నాకు టెస్టు జట్టులోకి పిలుపు వచ్చిన వెంటనే నా కోచ్‌ గర్వంగా ఫీలయ్యారు’ అని రిషబ్‌ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement