డివిలియర్స్‌ మరికొంత కాలం..

De Villiers To Play IPL For Few More Years - Sakshi

అతడు బ్యాటింగ్‌కు దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే.. బంతి ఎక్కడ వేయాలో బౌలర్లకు పాలుపోదు. ఆ దిగ్గజ ఆటగాడు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకంటించడంతో అభిమానులు షాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఇక ‘మిస్టర్‌ 360’ ఆటను మైదానాల్లో చూడలేమా అని ఆందోళన చెందుతున్న అభిమానులకు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ శుభవార్త తెలిపారు. ఒక మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్‌ గురించి, భారత్‌తో తనకున్న అనుబంధం గురించి  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఐపీఎల్‌ 2018 టోర్నీ అనంతరం అన్ని ఫార్మట్లకు గుడ్‌బై చెప్పిన ఏబీ.. తాజాగా తాను మరికొంత కాలం ఐపీఎల్‌లో ఆడతానని ప్రకటించారు. దేశవాళిలో టైటాన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, యువ ఆటగాళ్లకు సూచనలు, సహాయం చేయాలని అనుకున్నానని, కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్లాన్స్‌ చేసుకోలేదని ఏబీ తెలిపారు. భారత్‌, బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌(ఆర్సీబీ)తో తనకున్న అనుబంధం గురించి వివరిస్తూ.. ‘బెంగళూర్‌ నాకు ఎంతో ప్రత్యేకమైనది, నాకు మరో జన్మస్థలం లాంటిది. నా 100వ టెస్టు ఆడింది అక్కడే. ఇక ఆర్సీబీ నా లైఫ్‌లో ఒక భాగం, భారత్ ఎంతో ప్రాముఖ్యమైన దేశం, ఆ దేశ గొప్పతనాన్ని వర్ణించటం నాలాంటి సామన్యుడితో కాదు’ అంటూ డివిలియర్స్‌ పేర్కొన్నారు.   

రిటర్మైం‍ట్‌పై.. తాను సరైన సమయంలోనే ఆటకు గుడ్‌బై చెప్పానని ఏబీ వివరించారు. 14 సంవత్సరాలుగా క్రికెట్‌ ఆడానని, అలసిపోయానని అందుకే వీడ్కోలు పలికానని స్పష్టం చేశారు. ప్రపంచకప్‌ గెలవడం కలగానే మిగిలిందని, కానీ ఏ టోర్నీలోనైనా మంచి ప్రదర్శన చేశాననే సంతృప్తి చెందినట్లు పేర్కొన్నారు.  2007లో జరిగిన ప్రపంచకప్‌ ఎంతో ప్రత్యేకమైనదని, తాను ఆడిన తొలి మెగా టోర్నమెంట్‌ కావడంతో కొంత ఉద్వేగానికి గురయ్యానని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top