
మెల్‌బోర్న్:ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్రతో దూసుకుపోతున్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి వరుస రికార్డులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోహ్లి ఇప్పటివరకూ సాధించిన టెస్టు శతకాలను ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తాజాగా దాటేశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్(103) శతకం సాధించాడు. తద్వారా తన టెస్టు సెంచరీలను 21కు పెంచుకున్నాడు వార్నర్. దాంతో విరాట్ కోహ్లి 20 సెంచరీలను వార్నర్ అధిగమించాడు. ఇటీవల శ్రీలంకతో మూడో టెస్టులో కోహ్లి తన కెరీర్‌లో 20 సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
యాషెస్ నాల్గో టెస్టులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఆసీస్ ఇన్నింగ్స్‌ను డేవిడ్ వార్నర్-బాన్‌క్రాప్ట్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం సాధించిన తరువాతర బాన్‌క్రాఫ్ట్ తొలి వికెట్‌గా అవుటయ్యాడు. కాగా, మరో ఓపెనర్ వార‍్నర్ మాత్రం కుదురుగా ఆడి శతకం సాధించాడు.