దాసన్‌కు కాంస్యం  | Dasan won the bronze medal | Sakshi
Sakshi News home page

దాసన్‌కు కాంస్యం 

Feb 3 2018 1:05 AM | Updated on Feb 3 2018 1:05 AM

Dasan won the  bronze medal - Sakshi

దాసన్‌

టెహ్రాన్‌: ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. పురుషుల 60 మీటర్ల రేసులో ఎలాకియా దాసన్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. అతను 6.67 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో దాసన్‌...  6.87 సెకన్లతో సమీర్‌ మోన్‌ పేరిట ఉన్న భారత జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే దాసన్‌ ప్రపంచ ఇండోర్‌ అథ్లెటిక్స్‌ అర్హత ప్రమాణాన్ని (6.63 సెకన్లు) అధిగమించడంలో సఫలం కాలేకపోయాడు.    

Advertisement
 
Advertisement
Advertisement