రొనాల్డో ఇక యువెంటస్‌ క్లబ్‌కు 

Cristiano Ronaldo signs for Juventus from Real Madrid - Sakshi

బదిలీ విలువ రూ. 846 కోట్లు!  

మాడ్రిడ్‌: పోర్చుగల్‌ కెప్టెన్, స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు  క్రిస్టియానో రొనాల్డో... ఇకపై ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ యువెంటస్‌కు ఆడనున్నాడు. గత తొమ్మిదేళ్లుగా అతడు స్పెయిన్‌కు చెందిన రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌కు ఆడుతున్నాడు. కొత్త ఒప్పందం ప్రకారం రొనాల్డో నాలుగేళ్లపాటు యువెంటస్‌కు ఆడతాడు. సీజన్‌కు 3 కోట్ల యూరోలు (రూ. 241 కోట్లు) చొప్పున రొనాల్డోకు వేతనంగా లభిస్తాయని సమాచారం. ఒదిలీ ఒప్పందంలో భాగంగా యువెంటస్‌ క్లబ్‌ 10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 846 కోట్లు) రియల్‌ మాడ్రిడ్‌కు చెలిస్తుందని స్పెయిన్‌ మీడియా వెల్లడించింది.

తాజా మార్పుపై రొనాల్డో స్పందిస్తూ... ‘మాడ్రిడ్‌కు ఆడిన సమయం నా జీవితంలో అత్యంత సంతోషకరమైనది. జట్టు, అభిమానులు, నగరానికి నా ధన్యవాదాలు. కొత్త అధ్యాయం ప్రారంభించాల్సిన సమయం వచ్చింది. అందుకే బదిలీకి అంగీకరించమని కోరా. మద్దతుదారులంతా అర్ధం చేసుకోగలరు’ అని పేర్కొన్నాడు. రొనాల్డో ప్రాతినిధ్యంలో... రియల్‌ మాడ్రిడ్‌ ఈ సీజన్‌లో చాంపియన్స్‌ లీగ్‌ను గెల్చుకుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top