పుజారా డబుల్ సెంచరీ | cheteshwar pujara ninth double gives Saurashtra innings-lead | Sakshi
Sakshi News home page

పుజారా డబుల్ సెంచరీ

Dec 2 2013 1:18 AM | Updated on Sep 2 2017 1:10 AM

పుజారా డబుల్ సెంచరీ

పుజారా డబుల్ సెంచరీ

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తన సూపర్ ఫామ్‌ను చాటుకున్నాడు.

చెన్నై: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తన సూపర్ ఫామ్‌ను చాటుకున్నాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-సి మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా తమిళనాడుపై డబుల్ సెంచరీ (461 బంతుల్లో 269; 33 ఫోర్లు)తో చెలరేగాడు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 161.4 ఓవర్లలో ఆరు వికెట్లకు సౌరాష్ట్ర 581 పరుగుల భారీ స్కోరును సాధించింది. జయదేవ్ షా (296 బంతుల్లో 195; 17 ఫోర్లు) కొద్దిలో ‘డబుల్’ను కోల్పోయాడు. తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్‌లో 565/8 స్కోరు సాధించడంతో 16 పరుగుల ఆధిక్యం సాధించిన సౌరాష్ట్రకు మూడు పాయింట్లు దక్కాయి.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు:
  త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో గోవా 49 పరుగుల తేడాతో నెగ్గింది.
  జార్ఖండ్, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
  విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ముంబై 338 పరుగుల భారీ విజయం సాధించింది.
  ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది.
  బెంగాల్, సర్వీసెస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement