సెలైవా బ్యాన్‌తో సమస్య లేదు: బ్రెట్‌లీ

Brett Lee Says Saliva Ban won't Effect Kookaburra Balls - Sakshi

కోకాబుర్రా బాల్స్‌ ఎక్కువ స్వింగ్‌ కావని,  సెలైవా నిషేధం వల్ల వాటిపై ప్రభావం ఎక్కువగా ఉండదని ఆస్ట్రేలిన్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రికెటర్ల ఆరోగ్యం దృష్ట్యా బంతికి సెలైవా రాయడాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిషేధించింది. అయితే సెలైవా రాయకపోతే బాల్‌ స్వింగ్‌ అయ్యే విధానంలో మార్పు వస్తుందని, ఇది బౌలర్‌ ఆట తీరుపై ప్రభావం చూపుతుందని చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం పై బ్రెట్‌లీ మాట్లాడుతూ, "ఇది ఖచ్చితంగా బౌలర్లకు ప్రతికూలత అని నేను అనుకుంటున్నాను. దీని కంటే క్రికెటర్లు మైదానంలోకి వెళ్ళేముందు వారందరిని పరీక్షించడం, అన్ని క్లియర్ అయిన వారిని మాత్రమే ఆటలో పాల్గొనడానికి అనుమతించడం దీనికి మరో మార్గమని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికి సెలైవా బ్యాన్‌ వల్ల కోకా బుర్రా బాల్స్‌ స్వింగ్‌లో ఎక్కువగా మార్పు రాదు. దీని వల్ల రివర్స్‌ స్వింగ్ కూడా  పెద్దగా ఉండదు. దాంతో సెలైవా రుద్దినా రుద్దకపోయినా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు‌’ అని అన్నారు. 

చదవండి: ఇక మా పని అయిపోయినట్లే: ఇషాంత్‌

చాలా రోజుల తరువాత ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల‌ మధ్య అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఈ రెండు జట్టులు మూడు టెస్ట్‌ సిరీస్‌లు ఆడనున్నాయి. వీటిలో మొదట జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ఆండ్రసన్ ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. అతని బౌలింగ్‌లో ఇంతకు ముందు ఉన్న స్వింగ్‌ కనిపించడం లేదని అంటున్నారు. దీనిపై బ్రెట్‌లీ మాట్లాడుతూ ఇంగ్లండ్‌ చాలా రోజుల తరువాత మ్యాచ్‌ ఆడిందని అందుకే ఇలా జరిగిందని అన్నారు. అంతే కానీ సెలైవా ఎఫెక్ట్‌ అంతలా ఉండదని  అభిప్రాయపడ్డాడు.

చదవండి: ఆ విషయంపై స్పష్టత లేదు: భువనేశ్వర్‌ కుమార్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top